క్రీడాకారిణి మృతదేహానికి పోస్టుమార్టం

ABN , First Publish Date - 2022-06-07T06:33:38+05:30 IST

క్రీడాకారిణి మృతదేహానికి పోస్టుమార్టం

క్రీడాకారిణి మృతదేహానికి పోస్టుమార్టం
పోస్టుమార్టం నిర్వహించేందుకు వచ్చిన అధికారులు

బుట్టాయగూడెం, జూన్‌ 6: గిరిజన యువతి, క్రీడాకారిణి మొడియం మంగ మృతిపై తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సోమవారం కొల్లాయిగూడెంలో కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాల నుంచి వచ్చిన ఇద్దరు అసిస్టెంట్‌ మెడికల్‌ ప్రొఫెసర్లు సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సరైన వైద్యం అందించకపోవడం వల్లే తమ కుమార్తె మరణించినట్లు తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగ తల్లిదండ్రులు కోరినట్లు కొల్లాయిగూడెంలో వైద్యులు, పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం పూర్తిచేశారు. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని అధికారు లు తెలిపారు. వైద్యులు డాక్టరు ఎస్‌.వెంకటేశ్వరావు, డాక్టరు ఎంవీ కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టరు బి.రమేష్‌, డాక్టరు కె.చంద్రబాబు, ఎన్‌వీవీ సత్యనారాయణరాజు, డి.శ్రీనివాస్‌, బుట్టాయగూడెం తహసీల్దార్‌ లక్ష్మీ కుమారి, జంగారెడ్డిగూడెం తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌, సీఐ బాలసురేష్‌, ఎస్‌ఐ సాగర్‌బాబు పాల్గొన్నారు.  


Read more