శాంతిభద్రతల రక్షణ చర్యలపై విద్యార్థులకు అవగాహన
ABN , First Publish Date - 2022-10-27T23:47:56+05:30 IST
ఓపెన్ హౌస్
భీమవరం క్రైం, అక్టోబరు 27: శాంతి భద్రతల పరిరక్ష ణపై విద్యార్థులకు అవగాహ న కార్యక్రమం నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్ర మాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్లు, నేర దర్యాప్తు విధానం తదితర విషయాలను ఏఎస్పీ (అడ్మిన్) ఏవీ సుబ్బరాజు విద్యార్థులకు వివరించారు. డాగ్ స్క్వాడ్ బృందాలు, బాంబు డిస్పోజల్ పరికరాలు, ఫింగర్ ప్రింట్, పోలీస్ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్, మ్యాస్ ప్యాక్ సెట్స్ పనిచేయు విధానం గురించి ఏఎస్పీ వివరించారు. ఆర్‌ఐ శ్రీకాంత్, ఎస్‌ఐ రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.