విద్యార్థినులపై టీచర్ వేధింపులు.. పోక్సో కేసు
ABN , First Publish Date - 2022-12-07T00:36:54+05:30 IST
విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ వచ్చిన అభియోగాలు నిజ మని విద్యా శాఖ అధికారులు ధ్రువీకరించడంతో అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
యలమంచిలి, డిసెంబరు 6 : విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ వచ్చిన అభియోగాలు నిజ మని విద్యా శాఖ అధికారులు ధ్రువీకరించడంతో అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యలమంచిలి ఎస్‌ఐ జేవీఎన్ ప్రసాద్ తెలిపిన వివరాలివి.. మేడపాడు హైస్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉన్నమట్ల దైవ ఆశీర్వాదకుమార్ గతంలో విద్యార్థినులను వేధిస్తున్నట్లు అభియోగాలు రావడంతో విద్యాశాఖ అధికారులు అతనిని మూడు నెలల క్రితం సస్పెండ్ చేశారు. ఇటీవల విద్యాశాఖాధికారులు అతనిపై విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. డీఈవో ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.