పాలకొల్లులో జోరుగా పేకాట!

ABN , First Publish Date - 2022-05-22T05:52:04+05:30 IST

పాలకొల్లులో జోరుగా పేకాట!

పాలకొల్లులో జోరుగా పేకాట!
రైల్వేస్టేషన్‌ రోడ్డులో బహిరంగంగా నిర్వహిస్తున్న పేకాట

గుంటూరు, రాజమండ్రి, భీమవరం ప్రాంతాల నుంచి జూదగాళ్ల రాక
చేతులు మారుతున్న రూ.లక్షలు

పాలకొల్లు టౌన్‌, మే 21: పట్టణంలో పేకాట జోరుగా సాగుతోంది. గుంటూరు, రాజమండ్రి, భీమవరం ప్రాంతాల నుంచి పేకాట ఆడేందుకు జూదగాళ్లు వస్తున్నట్లు సమాచారం. పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంలో రోజుకు రూ.10లక్షలు, అంతకుపైబడి సొమ్ము చేతులు మారుతున్నట్లు తెలియవచ్చింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో భారీస్థాయిలో పేకాట ఆడుతున్నప్పటికీ పోలీసులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందంటూ పలువురు విమ ర్శిస్తున్నారు. పోలీసు శాఖలోని కొందరు కిందిస్థాయి ఉద్యోగులు వీరికి సహాయం చేస్తున్నారంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  


Updated Date - 2022-05-22T05:52:04+05:30 IST