మతి స్థిమితం లేని యువకుడి వీరంగం

ABN , First Publish Date - 2022-05-02T06:21:47+05:30 IST

కైకలూరు పట్టణంలో మతి స్థిమితం లేని యువకుడు వీరంగం సృష్టించాడు.

మతి స్థిమితం లేని యువకుడి వీరంగం

కైకలూరు, మే 1: కైకలూరు పట్టణంలో మతి స్థిమితం లేని యువకుడు వీరంగం సృష్టించాడు. ఒరిస్సా రాష్ర్టానికి చెందిన ఈ యువకుడు శనివారం రాత్రి  కైకలూరు విజయలక్ష్మి థియేటర్‌ సెంటర్‌లో రహదార్లపై సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాడు.  ఆదివారం ఉదయం బస్టాండ్‌ సెంటర్‌లో పార్క్‌చేసి ఉన్న కారును తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా స్థానికులు టౌన్‌ పోలీసులుకు అప్పగించారు. ఎట్టకేలకు అతని నుంచి సమాచారం రాబట్టి ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 

Updated Date - 2022-05-02T06:21:47+05:30 IST