-
-
Home » Andhra Pradesh » West Godavari » nss programmes poster inaguaration at west godavari dist-MRGS-AndhraPradesh
-
యువతలో సేవాభావం పెంపుకే ఎన్‌ఎస్‌ఎస్ సేవలు
ABN , First Publish Date - 2022-09-18T05:28:56+05:30 IST
యువతలో క్రమశిక్షణ, ఏకాగ్రత, సేవాభావం పెంచేందుకు ఎన్ ఎస్‌ఎస్ సేవలు ఉపకరిస్తాయని డీఆర్‌వో కె.కృష్ణవేణి అన్నారు.

భీమవరం, సెప్టెంబరు 17 : యువతలో క్రమశిక్షణ, ఏకాగ్రత, సేవాభావం పెంచేందుకు ఎన్ ఎస్‌ఎస్ సేవలు ఉపకరిస్తాయని డీఆర్‌వో కె.కృష్ణవేణి అన్నారు. జాతీయ సేవా పథక దినోత్సవ పోస్టర్లను శనివారం ఆమె ఆవి ష్కరించారు. ఈనెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పట్టణ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్స్ సహకారంతో, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో నన్నయ యూనివర్సిటీ, ఎన్‌ఎస్‌ఎస్ వారోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ 19న డాక్టర్ సీఎస్‌ఎన్ కళాశాలలో ప్రారంభిస్తామని, 24న ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్లకు అవార్డులు, నిత్యం సేవలందించే పలువురిని సత్కరిస్తామన్నారు. ఆర్‌డీవో దాసి రాజు, ఏవో వై.దుర్గాకిషోర్, తహసీల్దార్ వై.రవికుమార్, శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు.