వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
ABN , First Publish Date - 2022-12-31T00:02:55+05:30 IST
వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.
ఇదేం ఖర్మ.. అంటూ టీడీపీ నేతల ధ్వజం
అత్తిలి, డిసెంబరు 30: వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. వరిఘేడు, యర్రనీలిగుంట గ్రామాల్లో శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ధాన్యం సేకరణ సరిగా లేక, ధాన్యం సొమ్ము రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో అనాల ఆదినారాయణ, ఆల్తి సత్యనారాయణ, చుక్కా సాయిబాబు, అడ్డాల సాయిబాబు, కొరిపల్లి హరి, బోడపాటి బుజ్జి, కె.శ్రీనివాసు, మెంతు రాజ్ కుమార్, బాలం త్రిమూర్తులు, పెచ్చెట్టి ప్రసాద్ పాల్గొన్నారు.
లోకేశ్ పాదయాత్ర పోస్టర్ల ఆవిష్కరణ
తణుకు: జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు బూటకమని తేలాయని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర పోస్టర్లు శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చాక జగన్ యువతను మోసం చేశారన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ రద్దు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ముస్లింలకు సంబం ధించి 10 పథకాలు రద్దు చేశారన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు, గంజా యి సాగు, అక్రమ రవాణాలో రాష్ట్రం ముందుందన్నారు. యువత, మహిళల సమస్యలు తెలుసుకోవడానికి లోకేశ్ జనవరి 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారని, యువగళం పేరుతో ప్రజల్లోకి రానున్నారని చెప్పారు. పార్టీ నాయకులు కలగర వెంకట కృష్ణ, దొమ్మేటి వెంకట సుధాకర్, తోట సూర్యనారాయణ, ఆనాల ఆదినారాయణ, పితాని మోహన్, అబ్బదాసరి లాజర్, సూరాసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ పాలనలో ధరల బాదుడు
తాడేపల్లిగూడెం అర్బన్: వైసీపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ చార్జీలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 24, 25 వార్డుల్లో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిం చారు. ప్రజల సమస్యలడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పూడి బాలాజీ, ఈదుపల్లి వాసు, పూడి సురేంద్ర, స్వాతి, పద్మనాభుని మురళి, పసలపూడి రాంబాబు, ముత్యాల శ్రీనివాస్, శీలి వెంకటాచలం, తదితరులు పాల్గొన్నారు. అనంతరం యువగళం పాదయాత్ర పోస్టర్‌ను వలవల బాబ్జి ఆవిష్కరిం చారు. యువతతోపాటు, అన్ని వర్గాలు విజయవంతం చేయాలని కోరారు.
అన్నీ దగా హామీలు
నరసాపురం రూరల్: వైసీపీ పాలనలో అన్నీ మోసం, దగా హామీలేనని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు అన్నా రు. పీఎంలంక గ్రామంలో శుక్రవారం ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహిం చారు. ఎన్నికల్లో బీసీ, ఎస్సీలకు 45ఏళ్లకే పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చి నేటికి అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. పేదల ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నాలుగైళ్లునా తీర ప్రాంతంలో పెండింగ్ పను లు ఒక్కటి కూడా ప్రారంభానికి నోచుకోలేదన్నారు. జీతాలు ఇవ్వలేని ప్రభు త్వం శంకుస్థాపనలతో ఆర్భాటం చేస్తుందన్నారు. పట్టణంలోని 3, 19, 20 వార్డుల్లో ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వాతాడి ఉమా, జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, కాగితపు వెంకటేశ్వరావు, షాన్‌వాజ్‌ఖాన్ పాల్గొన్నారు.