మార్కెట్‌కు కొత్త సంవత్సర శోభ

ABN , First Publish Date - 2022-12-31T00:16:38+05:30 IST

కొద్ది గంటల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు చాలా మంది ఉత్సుకతతో ఉన్నారు.

మార్కెట్‌కు కొత్త సంవత్సర శోభ
బిర్యానీ ఆఫర్లు

పోటా పోటీగా బిర్యానీ ఆఫర్లు.. కేక్‌లు, బొకేలకు గిరాకీ

నరసాపురం టౌన్‌ /ఆచంట, డిసెంబరు 30: కొద్ది గంటల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు చాలా మంది ఉత్సుకతతో ఉన్నారు. కొత్త సంవత్సరం అంతా సాఫీగా సాగుతుందన్న ఆశతో బంధువులు, స్నేహితులతో వేడుకలకు ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. యువతను ఆకర్షించేందుకు వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దుకాణాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. కొత్త ఏడాది డిస్కాంట్‌, ఆఫర్‌ బోర్డులను దుకాణాల ముందు పెట్టారు. ఈ పోటీలో రెస్టారెంట్లు ముందుంజలో ఉన్నాయి.

ప్రధానంగా నాన్‌ వేజ్‌ బిర్యానీ రేట్లను తగ్గించారు. రూ 300 ధరకు రెండు మినీ బిర్యానీలు, పుల్‌ బిర్యానీ రూ.100 తగ్గింపు, బిర్యానీకి లీటర్‌ డ్రింక్‌ బాటిల్‌, ఫ్రై చికెన్‌ పీసులు ఇలా రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఇక చిన్న రెస్టారెంట్‌లు కూడా రూ 200 రెండు మినీ బిర్యానీలంటూ శుక్రవారం విసృత్తంగా మైక్‌ ప్రచారం చేయించాయి. కొత్త సంవత్సరం వేడుకల ప్రత్యేకం కేక్‌లు. వారం రోజుల ముందు నుంచి ఆర్డర్లపై కేక్‌లు తయారు చేస్తుంటారు. కొన్ని కేక్‌లకు అఫర్లు ఇస్తున్నారు. కూల్‌ కేక్‌ కేజీ కొంటే లీటర్‌ డ్రింక్‌, రూ. వెయ్యి కొనుగోలుపై లీటర్‌న్నర బాటిల్‌, బెలూన్స్‌, క్యాన్‌డీల్స్‌ వంటివి ఇస్తున్నారు. పండ్లు, పూల బోకేలకు మంచి డిమాండ్‌. వ్యాపారులు అర్డర్లు తీసుకుని బోకేలు తయారు చేస్తున్నారు. పండ్ల ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. స్వీట్‌ షాపులకు డిమాండ్‌ తాకింది.

పాలకొల్లు అర్బన్‌: పట్టణంలో కొత్త సంవత్సర వ్యాపారం సందడిగా సాగుతోంది. రెస్టారెంట్లు, బిర్యాని సెంటర్లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. కేకు ఆర్డర్లపై డ్రింకు బాటిల్స్‌, చికెన్‌ బిర్యాని, బాస్మతి బిర్యాని, బాస్మతి జాయింట్‌ బిర్యానిల ధరలు తగ్గించడంతో పాటు, బాస్మతి మిక్స్‌డ్‌ బిర్యాని, ప్రతీ 500 కొనుగోలుపై కూల్‌డ్రింక్‌ ఉచితం అంటూ ప్రకటించారు. చేసారు. వస్త్ర, ఫర్నీ చర్‌ వ్యాపారులు గత 15రోజుల నుంచి ఆఫర్లు పేరుతో వినియోగ దారులను ఆకట్టుకుంటున్నారు. వస్త్ర దుకాణాల్లో ఆశించిన వ్యాపారం లేదు.

Updated Date - 2022-12-31T00:16:41+05:30 IST