పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-03-05T05:36:45+05:30 IST

పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు, కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఆర్‌.త్రినాథరావు అన్నారు.

పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం
కొవ్వూరు ఆంధ్ర షుగర్స్‌లో ప్రతిజ్ఞ చేయిస్తున్న అధికారులు

కొవ్వూరు, మార్చి 4: పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు, కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఆర్‌.త్రినాథరావు అన్నారు. ఆంధ్ర షుగర్స్‌లో శుక్రవారం జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. క్లోరిన్‌ లీక్‌ అయితే అరికట్టడం, ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడం, భద్రతా పరికరాలు వినియోగం అంశాలపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించి అవగాహన కల్పించారు. కార్మికులతో భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. త్రినాథరావు మాట్లాడుతూ చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. పరిశ్రమల ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఏటా మార్చి 4 నుంచి 10వరకు జాతీయ భద్రతా వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంధ్ర షుగర్స్‌ సేఫ్టీ ఆఫీసర్‌ కేవీవీ.సత్యనారాయ ణమూర్తి ఫ్యాక్టరీలో భద్రతా చర్యలను వివరించారు. కొవ్వూరు, సగ్గొండ ప్యాక్టరీలలో కార్మికులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతుల ను అందజేశారు. ఫ్యాక్టరీ మేనేజర్‌ ఈ.వెంకటకృష్ణారావు, అడ్మినిస్ట్రేషన్‌ ఏజీ ఎం ఆర్‌.ప్రభాకర చౌదరి, సగ్గొండ డిజిఎం ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు.


గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రంలో..


272 మెగావాట్ల గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో జాతీయ భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. సీతంపేట (విజ్జేశ్వరం సెంటర్‌) జీటీపీఎస్‌ కేంద్రంలో ఏపీజీపీసీఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.చిట్టిబాబు ఆధ్వ ర్యంలో కార్మికులు, పరిసర ప్రాంత పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, భద్రతా పరికరాల ప్రదర్శన ఏర్పాటుచేశారు. జనరల్‌ మేనేజర్‌ ఎం.చిట్టిబాబు మాట్లాడుతూ భద్రద పాటించడంలో యాజమాన్యం మరింత ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ఆర్‌.త్రినాథరావు, ఎ.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎటువంటి విపత్కర పరిస్థితులలో భద్రతా నియమాలను ఉల్లంఘించరాదన్నారు.

Updated Date - 2022-03-05T05:36:45+05:30 IST