AP News: నారా లోకేష్ అరెస్టు అప్రజాస్వామికం: బొరగం శ్రీనివాసులు

ABN , First Publish Date - 2022-08-22T01:33:47+05:30 IST

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా) : టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అక్రమ అరెస్టును టీడీపీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఖండించారు. పలాసలో టీడీపీ

AP News: నారా లోకేష్ అరెస్టు అప్రజాస్వామికం: బొరగం శ్రీనివాసులు

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా) : టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అక్రమ అరెస్టును టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఖండించారు. పలాసలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆస్తుల విధ్యంసమే లక్ష్యంగా వైసీపీ (YSRCP) నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల అక్రమాలను  ప్రశ్నించిన టీడీపీ కౌన్సిలర్ సూర్యనారాయణ ఇంటిని కూల్చేందుకు యత్నించడం ప్రశ్నించే గొంతులను అణచివేయడమేనన్నారు. వైసీపీ మంత్రులు, నాయకుల చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా మారడం బాధాకరమన్నారు. పలాసలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పోలీసు శాఖకు అప్రతిష్టపాలు చేస్తుందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు కక్షపూరిత చర్యలు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Updated Date - 2022-08-22T01:33:47+05:30 IST