మున్సిపల్‌ కార్యాలయంలో పార్టీ సమావేశం

ABN , First Publish Date - 2022-06-11T05:39:27+05:30 IST

మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో సమావేశానికి వైసీపీ నేతలను ఎలా అనుమతిస్తారని అధికారులను టీడీపీ, జనసేన కౌన్సిలర్లు నిలదీశారు.

మున్సిపల్‌ కార్యాలయంలో పార్టీ సమావేశం
మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ, జనసేన కౌన్సిలర్లు

ఆకివీడులో టీడీపీ, జనసేన కౌన్సిలర్ల నిరసన


ఆకివీడు, జూన్‌ 10: మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో సమావేశానికి వైసీపీ నేతలను ఎలా అనుమతిస్తారని అధికారులను టీడీపీ, జనసేన కౌన్సిలర్లు నిలదీశారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్ను కున్న తమను సమావేశానికి పిలవకుండా అధికార పార్టీ వారితో సమావేశం నిర్వ హించి తమను అవమానిస్తారా అంటూ అధికారుల తీరును దుయ్యబట్టారు. బోర్డు ద్వారా జరిగే పనులు తమకు తెలపడంలేదని, వార్డులో కూడా మాకు తెలియకుండానే పనులు చేస్తున్నారంటూ టీడీపీ, జనసేన కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత, కిమిడి అరుణకుమారి, బత్తుల శ్యామల, మోపిదేవి సత్యవతి, గుర్రాన నాగలక్ష్మి, నేరెళ్ళ ప్రసన్న కమిషనర్‌ చోడగం వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నల్లం శ్రీమన్నారాయణను నిలదీశారు. అధికారపార్టీకి కొందరు అధికారులు తొత్తుల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. బిల్లులు కూడా ఇష్టానుసారంగా పెట్టుకుంటున్నారని ప్రశ్నిస్తే అడ్డగోలుగా సమాధానాలు చెబుతున్నారన్నారు. అధికారుల తీరుపై కోర్టుకు వెళతామని, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొల్లా వెంకట్రావు, గొంట్లా గణపతి, బొల్లా శేషు, కిమిడి నాగరాజు, బత్తుల రవి, మోపిదేవి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-11T05:39:27+05:30 IST