కాళ్ళకూరులో ముక్కోటి సందడి

ABN , First Publish Date - 2022-12-31T00:14:21+05:30 IST

ముక్కోటి సందర్భంగా కాళ్ళకూరు వేంకటేశ్వరస్వా మి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

కాళ్ళకూరులో ముక్కోటి సందడి
కాళ్ళకూరు ఆలయం వద్ద బారికేడ్స్‌

ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు

కాళ్ళ, డిసెంబరు 30: ముక్కోటి సందర్భంగా కాళ్ళకూరు వేంకటేశ్వరస్వా మి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 3గంటల నుంచి భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు. స్వామివారి దర్శనానికి చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని ఆలయ చైర్మన్‌ దండు వెంకట కృష్ణంరాజు, ఈవో చాగంటి సురేష్‌నాయుడు అన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-12-31T00:14:23+05:30 IST