ఎవరిదీ మోటార్‌ సైకిల్‌?

ABN , First Publish Date - 2022-01-13T05:49:26+05:30 IST

తాడేపల్లి గూడెం నిట్‌ కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపైన ఓ ఖరీదైన మోటార్‌ సైకిల్‌ ఐదు రోజుల నుంచి అక్కడే ఉంటోంది

ఎవరిదీ మోటార్‌ సైకిల్‌?

తాడేపల్లిగూడెం క్రైం, జనవరి 12: తాడేపల్లి గూడెం నిట్‌ కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపైన ఓ ఖరీదైన మోటార్‌ సైకిల్‌ ఐదు రోజుల నుంచి అక్కడే ఉంటోంది. అది ఇటీవలే కొనుగోలు చేసిన మోటార్‌ సైకిల్‌. కనీసం హ్యాండ్‌ లాక్‌ కూడా వేయకుండా వదిలేశారు. ఈ మోటార్‌ సైకిల్‌ ఎవరిది ? ఎందుకు ఇక్కడ వదిలేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని చాసిస్‌ నెంబర్‌ ఆధారంగా ఎవరిదోనని ఆరా తీసే పనిలో పడ్డారు.


Updated Date - 2022-01-13T05:49:26+05:30 IST