ఉద్యాన సాగులో ఆధునిక పద్ధతులు

ABN , First Publish Date - 2022-03-05T05:45:16+05:30 IST

ఉద్యాన పంటల సాగులో ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించేవిధంగా కృషిచేస్తునట్లు వైఎస్‌ఆర్‌ ఉద్యాన యూనివర్సిటీ వీసీ టి. జానకిరామ్‌ తెలిపారు.

ఉద్యాన సాగులో ఆధునిక పద్ధతులు
రైతులకు సూచనలు ఇస్తున్న శాస్త్రవేత్తలు

కొవ్వూరు, మార్చి 4: ఉద్యాన పంటల సాగులో ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించేవిధంగా కృషిచేస్తునట్లు వైఎస్‌ఆర్‌ ఉద్యాన యూనివర్సిటీ వీసీ టి. జానకిరామ్‌ తెలిపారు. కొవ్వూరు ఉద్యాన పరిశోధన శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ ఉద్యాన పరిశోధన కేంద్రం నుంచి 13 రకాల వంగడాలకు జాతీయ గుర్తింపు లభించిందన్నారు. కొవ్వూరు పరిశోధన కేంద్రం నుంచి వచ్చిన గజేంద్ర రకం కంద పంటను దేశవ్యాప్తంగా అధికశాతం రైతులు సాగుచేస్తున్నారన్నారు. వెంకట్రామన్నగూడెం పరిశోధనా కేంద్రం చుట్టూ 15 కి.మీ పరిధిలోని రైతులకు కమ్యూనిటీ రేడియో ద్వారా సూచనలు ఇస్తున్నామన్నారు. త్వరలో దేశం మొత్తం రైతులతో మమేకమయ్యేందుకు యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఉద్యాన పరిశోధన కేంద్రాలు, కళాశాలల పరిధిలో రెండు గ్రామాలను దత్తత తీసుకుని శాస్త్రవేత్తలు పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. తిరువనంతపురం కేంద్రీయ దుంప పంటల పరిశోధన స్థానం సహకారంతో వైఎస్‌ఆర్‌ ఉద్యాన పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు దుంప పంటల సాగుపై శిక్షణ ఇచ్చారు. శాస్త్రవేత్తలు అందించిన సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని రైతులకు పంపిణీ చేశారు. కొవ్వూరు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త జి.రామానందం, కేంద్రీయ దుంప పంటల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డి.జగన్నాధం, ఏవీవీ.కౌండిన్య, శాస్త్రవేత్తలు కె.మమత, ఆర్‌.నాగలక్ష్మి, కె.రవీంద్ర, ఎ.స్నేహలత రాణి, తదితరులు పాల్గొన్నారు.

Read more