సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-12-07T23:41:46+05:30 IST

భీమవరంలో వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాస భలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు కోరారు.

సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి
విలేకరులతో మాట్లాడతున్న ఎమ్మెల్సీ ఐవీ

తణుకు, డిసెంబరు 6: భీమవరంలో వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాస భలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు కోరారు. సీపీఎం కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతోందని విమర్శించారు. చింతకాయల బాబురావు, పీవీ.ప్రతాప్‌, అడ్డగర్ల అజయకుమారి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:41:48+05:30 IST