మద్యాంధ్రప్రదేశ్‌ చేసేశారు

ABN , First Publish Date - 2022-09-13T05:35:49+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్ర ప్రదేశ్‌గా చేసేశారని ఎమ్మెల్యే రామరాజు అన్నారు.

మద్యాంధ్రప్రదేశ్‌ చేసేశారు
చెరుకుమిల్లిలో ఎమ్మెల్యే రామరాజుకు హారతి ఇస్తున్న మహిళలు

వైసీపీ పాలనపై ఎమ్మెల్యే రామరాజు ధ్వజం


ఆకివీడు రూరల్‌ సెప్టెంబరు 12: ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్ర ప్రదేశ్‌గా చేసేశారని ఎమ్మెల్యే రామరాజు అన్నారు. చెరుకుమిల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తా నని అధికారంలోకి వచ్చి మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత వైసీపీ దేన న్నారు. విచక్షణ లేకుండా మహిళలను అమర్యాదగా మాట్లాడుతున్న నాయ కులు తీరు దారుణమన్నారు. ప్రజలు వైసీపి ప్రభుత్వానికి చరమగీతం పలికేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. తనకు జన్మనిచ్చింది ఒక ఆడదే అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడం తెలుగు జాతికే మాయని మచ్చ అని మాజీ సర్పంచ్‌ బొర్రా సుజాత అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు మోటుపల్లి ప్రసాద్‌, నౌకట్ల రామారావు, కనుమూరు రామకృష్ణంరాజు, దాట్ల బుజ్జిరాజు, మంతెన మురళీరాజు, బొర్రా రాంబాబు, చుక్కా మన్మోహన్‌, దాట్ల సుబ్బరాజు,  తదితరులు పాల్గొన్నారు. 


కొడాలి నానిది రాక్షసానందం


నరసాపురం: గుడివాడ ఎమ్మెల్యే కొడాల నానిది రాక్షసా నందమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పై కొడాల నాని వ్యాఖ్యలను నిర సిస్తూ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఆనం తరం నానిపై చర్యలు తీసుకోవాలని స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమం లో రాజ్యలక్ష్మి, జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవి, ఆనం త రామారావు, షేక్‌ హుసేన్‌, సంకు భాస్కర్‌, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Read more