నిమ్మల యాత్రకు నీరాజనం
ABN , First Publish Date - 2022-03-05T05:38:42+05:30 IST
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన పాలకొల్లు నుంచి అమరావతి సైకిల్ యాత్రకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలి కారు.
పాలకొల్లుఅర్బన్/పాలకొల్లురూరల్/పాలకోడేరు/వీరవాసరం/భీమవరం, మార్చి 4 : పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన పాలకొల్లు నుంచి అమరావతి సైకిల్ యాత్రకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలి కారు.పాలకొల్లులో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రోజారమణి హార తిచ్చి ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్రకు ఎదురు వచ్చారు. లాకుల వద్ద శ్రీ దేశాలమ్మ అమ్మవారికి పూజలు చేసి బయలుదేరారు. పూలపల్లి వద్ద మహిళలు హారతులు ఇచ్చారు. పాలకోడేరు, వీరవాసరం, భీమవరం, ఉండి మండల కేంద్రాల్లో నాయకులు పూలమాలలు వేశారు. వీరవాసరం మండల కేంద్రంలో టీడీపీ, జనసేన నాయకులు, ఉండిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. టిడ్కో గృహాల లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని, పూర్తయిన ప్లాట్లను వారికి వెంటనే అందజేయాలని యాత్ర చేపట్టినట్టు తెలిపారు.ప్రతి లబ్ధిదారుడికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. జగన్ ప్రభుత్వం మెద్దునిద్రలో ఉందన్నారు. సీఎం జగన్ ప్రజల కష్టా లు, ఇష్టాలు తెలియకుండా పాలన సాగిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రామానాయుడు సైకిల్యాత్రకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. పాములపర్రులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు.పేదలకు ఇళ్లు స్వాధీనం చేసే వరకూ ఉద్యమాన్ని ఆపేది లేద న్నారు.భీమవరం ప్రకాశంచౌక్ చేరుకునేసరికి నమాజు సమయం కావడంతో భీమవరం టీడీపీ ముస్లిం కమిటీ నాయకులు నమాజ్ చేశారు.భీమవరంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారఽథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, అధికార ప్రతినిధి నరహరిశెట్టి రూపవాణి, పట్టణ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్ గజమాలతో సత్కరించారు.పాలకొల్లులో రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ నాయకులు గండేటి వెంకటేశ్వరరావు, ధనాని సూర్య ప్రకాష్, పాలకోడేరులో మండల టీడీపీ అధ్య క్షుడు దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, దొంగ కృష్ణ, దుర్గ, ప్రసాదరాజు, గుత్తుల సత్యనారాయణ,వీరవాసరంలో వీరవల్లి చంద్రశేఖర్, గుండా రామకృష్ణ, జడ్డు శ్రీనివాసరావు(బాబి), కొల్లేపర శ్రీనివాస్, అడిదల చిరంజీవి, గొర్రె కృష్ణమూర్తి, మామిడిశెట్టి సత్యనారాయణ,కుక్కల సత్యనారాయణ, భీమవరంలో మా మిడిశెట్టి ప్రసాద్, కోళ్ళ నాగబాబు, మైలాబత్తుల ఐజాక్ బాబు,చెల్లబోయిన సుబ్బారావు, గంట త్రిమూర్తులు, చెల్లబోయిన గోవిందు, రాము,జుత్తుగ శ్రీని వాసరావు,మోపిదేవి శ్రీను, పొత్తూరి వెంకటేశ్వరరాజు, కరిమెరక శ్రీను, మంతెన సూర్యనారాయణరాజు,ఎంపీటీసీ యువరాజు, కాగిత మహంకాళి పాల్గొన్నారు.