రైతుల సంక్షేమం పట్టని ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-27T05:45:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు.

రైతుల సంక్షేమం పట్టని ప్రభుత్వం
టీడీపీ రైతు సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు అర్బన్‌, మే 26: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి రైతు విభాగం సమావేశం ఎమ్మెల్యే అధ్యక్షతన గురువారం నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర, కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో సొమ్ము చెల్లింపులు లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏడాది మొత్తంలో అకాల వర్షాలు, వరదలు, నీటి ఎద్దడితో రైతులు అష్టకష్టాలు పడినా ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో రైతు నాయకులు బోనం నాని, రుద్రరాజు సత్యనారాయణ రాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, కోడి విజయభాస్కర్‌, మామిడిశెట్టి పెద్దిరాజు, జివి, సత్యశ్రీను, అంజి, నెక్కంటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:45:58+05:30 IST