అభివృద్ధి లక్ష్యంగా పాలన : మంత్రి కారుమూరి

ABN , First Publish Date - 2022-08-05T05:03:30+05:30 IST

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

అభివృద్ధి లక్ష్యంగా పాలన : మంత్రి కారుమూరి
సభలో మాట్లాడుతున్న మంత్రి కారుమూరి

అత్తిలి, ఆగస్టు 4: అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అత్తిలిలో నియోజకవర్గ స్థాయి కాపు నేస్తం, జగనన్న తోడు, కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురు వారం నిర్వహించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ప్రతీ ఒక్కరూ తమ ఇంటిపై ఆగస్టు 13 నుంచి 15 వరకు జెండాలు ఎగర వేయాలన్నారు. కార్యక్రమంలో గుబ్బల తమ్మయ్య, డ్వామా పీడీ ఎస్టీవీ రాజేశ్వరరావు, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, జడ్పీటీసీ అడ్డాల జానకి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:03:30+05:30 IST