Alluri Dist.: పోలీసుల ఎదుట లొంగిపోయిన మిలిసియా సభ్యులు
ABN , First Publish Date - 2022-12-07T14:24:48+05:30 IST
అల్లూరి జిల్లా: సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఎదుట 34 మంది మిలిసియా సభ్యులు, ఒక మావోయిస్టు సభ్యురాలు లొంగిపోయారు.
అల్లూరి జిల్లా: సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఎదుట 34 మంది మిలిసియా సభ్యులు, ఒక మావోయిస్టు సభ్యురాలు లొంగిపోయారు. వారిలో మావోయిస్టు దళ సభ్యురాలు భారతి ఉన్నారు. పెదబయలు దళానికి చెందిన వారి వద్ద నుంచి డంప్ స్వాధీనం చేసుకున్నారు. దళ సభ్యురాలు భారతిపై లక్ష రూపాయలు ప్రభుత్వ రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మిలిసియ సభ్యులకు పునరావాస చర్యలు చేపడతామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.