వీరవాసరంలో మెగా సందడి

ABN , First Publish Date - 2022-07-05T05:48:14+05:30 IST

రాజమండ్రి నుంచి వీరవాసరం మీదుగా రోడ్డు మార్గలంలో మోదీ సభకు భీమవరం వెళుతున్న మెగా స్టార్‌ చిరంజీవికి వీరవాసరంలో అభిమానులు స్వాగతం పలికారు.

వీరవాసరంలో మెగా సందడి
వీరవాసరంలో అభివాదం చేస్తున్న సినీ నటుడు చిరంజీవి

వీరవాసరం, జూలై 4: రాజమండ్రి నుంచి వీరవాసరం మీదుగా రోడ్డు మార్గలంలో మోదీ సభకు భీమవరం వెళుతున్న మెగా స్టార్‌ చిరంజీవికి వీరవాసరంలో అభిమానులు స్వాగతం పలికారు. చిరంజీవి ప్రయాణిస్తున్న వాహనాన్ని సోమవారం వీరవాసరం బస్టాండ్‌ సెంటర్‌లో నిలుపుదల చేశారు. అభిమానులు బొకే, పూలదండలు అందజేశారు. పూలు  చల్లి స్వాగతం పలికారు. అభిమానులకు కారు పైభాగం నుంచి చిరంజీవి అభివాదం చేశారు. చిరంజీవి పాలకొల్లు–వీరవాసరం రహదారిలో భీమవరం వెళతారని తెలుసుకున్న అభిమానులు వీరవాసరంలో వేచి ఉన్నారు. చిరంజీవి వెంట భీమవరం వాహనాలపై తరలివెళ్ళారు.

Read more