స్టేడియం నిర్మాణానికి లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2022-06-25T06:23:46+05:30 IST

నూజివీడు ఇండోర్‌ స్టేడియం భూ వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది.

స్టేడియం నిర్మాణానికి లైన్‌ క్లియర్‌
తహసీల్దార్‌కు భూ పత్రాలు అందిస్తున్న నటి సుప్రియ

నూజివీడు, జూన్‌ 24: నూజివీడు ఇండోర్‌ స్టేడియం భూ వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది.   ఆర్‌ఎస్‌ నంబరు 1063లో గల 11.11 సెంట్లు రెవెన్యూ శాఖకు కేటాయిస్తూ కోర్టు తీర్పునివ్వడంతో సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు బంధువు, నటి యార్లగడ్డ సుప్రియ సంబంధిత భూ పత్రాలను నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు సమక్షం లో తహసీల్దార్‌ ఎల్లయ్య రావుకు అప్పగించారు. సదరు భూమిలోనే గతంలో ఇండోర్‌ స్టేడియం నిర్మా ణానికి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేయగా నాటి నుంచి స్టేడియం నిర్మాణం పెండింగ్‌లో ఉండిపోయింది. ప్రస్తుతం అక్కినేని వారసులకు, రెవెన్యూ శాఖకు మధ్య ఉన్న వివాదాన్ని హైకోర్టు పరిష్కరిం చడంతో స్టేడియం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని పలువురు క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-06-25T06:23:46+05:30 IST