-
-
Home » Andhra Pradesh » West Godavari » left parties agitation-MRGS-AndhraPradesh
-
మొండి చేయి చూపిన మోదీ
ABN , First Publish Date - 2022-07-06T05:17:51+05:30 IST
అల్లూరి సీతారా మరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరం వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధికి మొండి చేయి చూపారని వామపక్షాల నేతలు విమర్శించారు.

భీమవరం అర్బన్, జూలై 5: అల్లూరి సీతారా మరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరం వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధికి మొండి చేయి చూపారని వామపక్షాల నేతలు విమర్శించారు. ప్రకాశం చౌక్‌లో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం, సీపీఐ ఏరియా కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, పార్వర్డ్‌బ్లాక్ నాయకులు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రధాని ప్రత్యేక హోదా, నిధులు, విభజన సమస్యలపై మాట్లాడకపోవడం తెలుగుప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. జేఎన్వీ గోపాలన్, డి.కళ్యాణి, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.