ఎంత బాధ కలిగితే చెప్పుతో కొట్టుకుంటాను ?

ABN , First Publish Date - 2022-03-05T06:26:29+05:30 IST

ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బా రాయుడు మరోసారి ఫైర్‌ అయ్యారు.

ఎంత బాధ కలిగితే చెప్పుతో కొట్టుకుంటాను ?
మాట్లాడుతున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

మరోసారి ఎమ్మెల్యే ముదునూరిపై కొత్తపల్లి ఫైర్‌


నరసాపురం మార్చి 4 : ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బా రాయుడు మరోసారి ఫైర్‌ అయ్యారు. నరసాపురం జేఏసీ శిబిరం వద్ద శుక్ర వారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ‘నాకు ఎంత బాధ, ఆవేదన ఉంటే ఆ రోజు అందరి ముందు చెప్పుతో కొట్టుకుంటాను..? ఇంటికి వెళ్లి పడుకుంటే నిద్రపట్టేది కాదు. నరసాపురం నుంచి జిల్లా కేంద్రం వెళ్లిపోతుంటే మేం ఓటు వేసిన ఎమ్మెల్యే ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాడనే బాధ తన్నుకొచ్చేది. బతికుండి దద్దమ్మల్లా ఉండి పోతున్నామన్న ఆవేదన దహించేసేది. ఈ బాధతోనే నాకు నేను కొట్టుకున్నా ! సరదా కోసం కాదు. ఇలా గైనా నీకు కనువిప్పు కలగలేదు. ఎంతో మంది నాకు ఫోన్‌ చేసి బాధపడ్డారు. కానీ, నువ్వు.. ప్రెస్‌మీట్‌ పెట్టి నన్ను విమర్శిస్తావా ? నా రాజకీయ జీవితం నీకేం తెలుసు ? ఎంతో మందిని రాజకీయా ల్లోకి తీసుకుని వచ్చా. నీలాగ వెన్నుపోటు రాజ కీయాలు చేయలేదు. 2014 ఎన్నికల్లో నీవు నీ అను చరులతో నాకు వెన్నుపోటు పొడవలేదా ?’ అంటూ ప్రసాదరాజుపై కొత్తపల్లి ఫైర్‌ అయ్యారు.

Read more