కోరుకొల్లు సర్పంచ్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-12-05T00:35:07+05:30 IST

కోరుకొల్లు సర్పంచ్‌ బట్టు లీలా కనకదుర్గను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈవోపిఆర్‌డీ శ్రావణ్‌ కుమార్‌ తెలి పారు.

కోరుకొల్లు సర్పంచ్‌ సస్పెన్షన్‌

కలిదిండి, డిసెంబరు 4 : కోరుకొల్లు సర్పంచ్‌ బట్టు లీలా కనకదుర్గను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈవోపిఆర్‌డీ శ్రావణ్‌ కుమార్‌ తెలి పారు. పంచాయతీలో ఆర్థిక పాలనా పరమైన అంశాల్లో లోపాలు ఉన్నందున సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబరు 23న సర్పంచ్‌ చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ అప్పటి డీపీవో నిమ్మగడ్డ బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. చెక్‌ పవర్‌ను రద్దు చేసిన పది రోజుల వ్యవధిలో సర్పంచ్‌ను సస్పెండ్‌ చేశారు. ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌గా ఉపసర్పంచ్‌ చెన్నంశెట్టి నాగరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.

న్యాయ పోరాటం చేస్తా : సర్పంచ్‌

తనను తాత్కాలికగా పదవి నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తానని కనకదుర్గ అన్నారు. సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి అధికార పార్టీ నాయకులు రాజకీయ కుట్రతో తనపై నిందారోపణలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నా రన్నారు. కలెక్టర్‌, పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు చేసి చెక్‌ పవర్‌ రద్దు చేయిం చారన్నారు. చెక్‌ పవర్‌ రద్దుపై హైకోర్టును ఆశ్రయించగా ఆ ఉత్తర్వులను కోర్టు సస్పెండ్‌ చేస్తూ ఈనెల 2వ తేదీన ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కలెక్టర్‌ తనను సర్పంచ్‌ పదవి నుంచి తొలగించారని సస్పెండ్‌ ఉత్తర్వులను ఆదివారం సెలవు రోజున కార్యదర్శి ఉదయ్‌ కుమార్‌ అంద జేశారన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్దంగా ఉన్నాయని ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని దీనిపై న్యాయపోరాటం కొనసాగిస్తానన్నారు.

Updated Date - 2022-12-05T00:35:10+05:30 IST