-
-
Home » Andhra Pradesh » West Godavari » kdcc bank chairman tanniru nageswara rao meeting at chatrayi eluru dist-MRGS-AndhraPradesh
-
‘రైతుల ఆర్థికాభివృద్ధే కేడీసీసీ బ్యాంకు లక్ష్యం’
ABN , First Publish Date - 2022-09-09T05:24:49+05:30 IST
వ్యవసాయానికి, అనుబంధ రంగాలకు విస్తృతంగా ఆర్థిక చేయూతను అందించడం ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి కేడీసీసీ బ్యాంకు తన వంతు పాత్ర నిర్వహిస్తుం దని బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు.

చాట్రాయి, సెప్టెంబరు 8: వ్యవసాయానికి, అనుబంధ రంగాలకు విస్తృతంగా ఆర్థిక చేయూతను అందించడం ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి కేడీసీసీ బ్యాంకు తన వంతు పాత్ర నిర్వహిస్తుం దని బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. గురువారం చిన్నంపేటలో రూ.31.75 లక్షలతో నూతనంగా నిర్మించనున్న పీఏసీఎస్ భవనానికి నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాపఅప్పారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం పీఏసీఎస్ అధ్యక్షుడు పరసా చెన్నారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చైర్మన్, ఎమ్మెల్యే మాట్లాడుతూ పీఏసీఎస్‌లలో నగదు లావాదేవీలతో పాటు లాకరు సదుపాయం కల్పించామన్నారు. మండలంలో చిన్నంపేట, పోలవరం, తుమ్మగూడెం పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కేడీసీసీ డైరెక్టర్ భూక్యా రాణి, ఎంపీపీ నిర్మల, నాయకులు దేశిరెడ్డి రాఘవరెడ్డి, టి.అశోక్‌కుమార్, బాబ్జీ, ప్రసాదబాబు, సర్పంచ్ పరసా ధనలక్ష్మి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.