వెలిగిన పాడ్యమి దీపం

ABN , First Publish Date - 2022-11-24T23:53:21+05:30 IST

కార్తీక మాసం ముగిసింది. పరమేశ్వర నీ ఆశీస్సులతో కార్తీమాసం దీక్షను పూర్తిచేసుకున్నాం. చల్లగా చూడాలంటూ ప్రార్థిస్తూ పొలాలమ్మకు మహిళలు పూజలు చేసి పాడ్యమి దీపాలను వెలిగించారు.

వెలిగిన పాడ్యమి దీపం
భీమవరంలో దీపాలు వదులుతున్న మహిళ

పోలాలమ్మకు పూజలు

భీమవరం టౌన్‌, నవంబరు 24 : కార్తీక మాసం ముగిసింది. పరమేశ్వర నీ ఆశీస్సులతో కార్తీమాసం దీక్షను పూర్తిచేసుకున్నాం. చల్లగా చూడాలంటూ ప్రార్థిస్తూ పొలాలమ్మకు మహిళలు పూజలు చేసి పాడ్యమి దీపాలను వెలిగించారు. గురువారం తెల్లవారుజామున కాల్వలు, చెరువులవద్ద అరటి డొప్పల్లో దీపాలను వదిలి భక్తిని చాటుకున్నారు. కాల్వల్లో స్నానం చేసి పొలా లమ్మ కథ చెప్పించుకుని పురోహితులకు దానాలను సమర్పించుకున్నారు. అనంతరం అరటి డొప్పల్లో ఆవునెయ్యితో చేసిన వత్తులను వెలిగించి వాటిని నీటిలో వదలి దీక్షను విరమించుకున్నారు. పట్టణంలోని ఆలయాల్లో స్వామి వారిని దర్శించుకున్నారు. భీమవరం సోమేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి, టూటౌన్‌లోని రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో దీపాలు వెలిగించారు. గును పూడి సోమేశ్వరస్వామి ఆలయం వద్ద చంద్రపుష్కరిణిలో దీపాలను వదిలా రు. జి అండ్‌ వి కెనాల్‌, తాడేరు వంతెన, లోసరి కాల్వ, అనాకోడేరు కాల్వల్లో ఆయాప్రాంత మహిళలు దీపాలను నీటిలో వదిలారు.

ఆకివీడు: పోలిస్వర్గం (పాడ్యమి)సందర్భంగా గురువారం తెల్లవారుజామున వెంకయ్య వయ్యేరు కాలువ గట్టున మహిళలు పెద్ద సంఖ్యలో దీపారాధన చేశారు. పండితులతో పూజలు నిర్వహించి దీపాలు కాలువలో వదిలారు. అనంతరం శైవ క్షేత్రాలలో ఈశ్వరుడిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఆచంట: వేకువజామునే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి, కాలువలో పాడ్యమి దీపాలు వెలిగించారు. ఆచంటేశ్వరుడి సన్నిధిలో అనేక మంది భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి రామగుండం చెరువులో పాడ్యమి దీపాలు వెలిగించారు. భక్తులకు ఆలయ అధికారి రాము, చైర్మన్‌ నెక్కంటి రామలింగేశ్వరరావు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

Updated Date - 2022-11-24T23:53:21+05:30 IST

Read more