కోటి రూపాయల 'కోణం' చేపలు పట్టిన Kakinada జాలర్లు

ABN , First Publish Date - 2022-06-25T21:26:22+05:30 IST

Kakinada జిల్లా: ఉప్పాడ తీరంలో మత్స్యకారుల (Fishermens) పంట పండింది.

కోటి రూపాయల 'కోణం' చేపలు పట్టిన Kakinada జాలర్లు

Kakinada జిల్లా: ఉప్పాడ తీరంలో మత్స్యకారుల (Fishermens) పంట పండింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒకే రోజు కోటి రూపాయల విలువైన చేపలు పట్టారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చేపల వేటపై నిషేధం ముగియడంతో మత్స్యకారులు సముద్రం బాట పట్టారు. కొత్తపల్లి మండలం, ఉప్పాడకు చెందిన నీలపల్లి సత్తిరాజు బృందం (20 మంది మత్స్యకారులు) రెండు ఫైబర్ బోట్లలో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారి వలలకు 12 టన్నుల ‘కోణం’ చేపలు పడ్డాయి. చేపలను హార్బర్‌కు తీసుకువచ్చి వ్యాపారులకు విక్రయించగా కిలో రూ. 9వందల చొప్పున కోటి రూపాయల ఆదాయం లభించింది. డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు పోగా.. ఒక్కో మత్స్యకారుడికి రూ. 2 లక్షలకుపైగా వచ్చాయి. ఒక్క రోజులోనే ఇంత పెద్ద మొత్తం చేతికి అందడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. కోటి రూపాయల విలువ చేసే చేపలు పడడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

Updated Date - 2022-06-25T21:26:22+05:30 IST