జన గణ మన గీతాలాపన
ABN , First Publish Date - 2022-12-28T00:05:02+05:30 IST
జాతీయ గీతం ‘జన గణ మన’ మొదటగా ఆలపించిన దినోత్సవాన్ని జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో బార్డోలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మంగళవారం నిర్వహించారు.
భీమవరం టౌన్, డిసెంబరు 27: జాతీయ గీతం ‘జన గణ మన’ మొదటగా ఆలపించిన దినోత్సవాన్ని జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో బార్డోలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మంగళవారం నిర్వహించారు. విద్యార్థులు ముక్తకంఠంతో జాతీయ గీతం ఆలపించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటాలు, జాతీయ జెండా లు చేతబట్టి విద్యార్థులు జన గణ మన ఆలపించడంతో అందరూ జైహింద్ అంటూ నినాదాలు చేశారు. శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి జాతీయ గీతం ఆలపించేటప్పుడు నిబంధనలను వివరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించా రు. గంధం శ్రీదేవి, నరహరిశెట్టి కృష్ణ, ఉపాధ్యాయులు ఉమా, రవి పాల్గొన్నారు.