ఇస్కాన్‌ మందిర నిర్మాణానికి భూమి పూజ

ABN , First Publish Date - 2022-08-05T05:07:21+05:30 IST

గొల్లలకోడేరులో ఇస్కాన్‌ మందిర నిర్మాణానికి గురువారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

ఇస్కాన్‌ మందిర నిర్మాణానికి భూమి పూజ
ఇస్కాన్‌ మందిర భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామరాజు

పాలకోడేరు, ఆగస్టు 4: గొల్లలకోడేరులో ఇస్కాన్‌ మందిర నిర్మాణానికి గురువారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన కనుమూరి సూర్యనారాయణరాజు, వెంకటనర్సమ్మ దంపతులు ఇచ్చిన రెండు ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణం కోసం భూమిపూజ, వాస్తు హోమం, సుదర్శన, నర్సింహ హోమం, వైష్ణవ హోమం తదితర పూజలు నిర్వహించారు. భూమి పూజ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-08-05T05:07:21+05:30 IST