నేను చచ్చిపోతున్నా
ABN , First Publish Date - 2022-08-05T05:14:17+05:30 IST
వాయిదా కట్టలేదని ఫైనాన్స్ వ్యాపారి వ్యాన్ తీసుకువెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
సెల్ఫీ వీడియోలో వాంగ్మూలం
వాయిదా కట్టలేదని వ్యాన్ తీసుకెళ్లిన ఫైనాన్సియర్.. మనస్తాపంతో ఆత్మహత్య
కైకలూరు, ఆగస్టు 4 : వాయిదా కట్టలేదని ఫైనాన్స్ వ్యాపారి వ్యాన్ తీసుకువెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలివి.. కైకలూరు మండలం నత్తగుళ్ళపాడు గ్రామానికి చెందిన ముంగర సోమరాజు(39) డీసీఎం వ్యాన్ ఫైనాన్స్‌పై తీసుకుని కిరాయిలకు తిప్పుతున్నాడు. నెల నెలా కిస్తీని చెల్లిస్తూ వచ్చాడు. రెండు నెలలుగా సోమరాజు అనారోగ్యానికి గురికావడం, కిరాయిలు లే కపోవడంతో కిస్తీలు చెల్లిం చలేకపోయాడు. దీనితో ఫైనాన్స్ వ్యాపారులు వాహనా న్ని లాక్కెళ్ళారు. కిస్తీ చెల్లించేందుకు కొంత గడువు కావా లని అప్పటి వరకు వాహనాన్ని తీసుకువెళ్లదని ప్రాఽధేయ పడినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనితో బుధవారం రాత్రి పులపర్రులో చేపల చెరువుపై నివసిస్తున్న అతని సోదరుని ఇంటికి వెళ్ళాడు. అర్ధరాత్రి సమయంలో సెల్ ఫోన్‌లో సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. ‘ఫైనాన్స్ కట్టలే దని వ్యాన్ తీసుకుని వెళ్లిపోయారు. మూడు వాయిదాల వరకు అవకాశం ఉన్నా.. రెండింటికే తీసుకెళ్లారు. కరోనా సమయంలోనూ వాయిదాలు పెట్టలేదు. కానీ, ఇప్పుడు ఇలా చేశారు. అందుకే మనస్తాపంతో చనిపోతున్నా.. కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి’ అని చెప్పి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం సోమరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి మృతదేహాన్ని స్వగ్రామమైన నత్తగుళ్ళపాడుకు తీసుకు వచ్చారు. గ్రామానికి చెందిన పలువురు ఈ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ 100 నెంబరుకు సమాచా రం అందించారు. దీనితో రూరల్ ఎస్సై సీహెచ్ కృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నత్తగుళ్ళపాడులో అనధికారికంగా నిర్వహిస్తున్న చీటీవారికి సోమరాజు సొమ్ము చెల్లించాలని, వారు అతనిపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం.