ఠారెత్తిస్తున్న ఎండలు

ABN , First Publish Date - 2022-03-16T05:45:36+05:30 IST

ఎండలు మండుతున్నాయి.

ఠారెత్తిస్తున్న ఎండలు
నిర్మానుష్యంగా మారిన శ్రీపర్రు రహదారి

ఉదయం 9 గంటల నుంచే సూర్య ప్రతాపం

ఏలూరురూరల్‌, మార్చి 15 : ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. గ్రామాల్లో ఉదయం వేళ దట్టంగా పొగ మంచు కురుస్తున్నది. 9 గంటల నుంచి ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతున్నది. కొద్ది రోజులుగా 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుండగా, మంగళవారం 39 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో వేడి ఎక్కువగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధారిటీ రెవెన్యూ విభాగం తెలిపింది. ఈ నెలాఖరు నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండతో మధ్యాహ్నానికి రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు వేసవిలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, చిన్నారులు వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలని సూచిస్తున్నారు.


Updated Date - 2022-03-16T05:45:36+05:30 IST