రహదారిపై కూలిన భారీ వృక్షం

ABN , First Publish Date - 2022-08-05T05:10:06+05:30 IST

భారీ వృక్షం రహదారిపై కూలడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కైకలూరు నుంచి కోరుకొల్లు వెళ్లే రోడ్డులో గురువారం ఉదయం భారీ వృక్షం కూలింది.

రహదారిపై కూలిన భారీ వృక్షం
కైకలూరు–కోరుకొల్లు రహదారిపై కూలిన భారీ వృక్షం

వాహనదారులకు తప్పని అవస్థలు

కైకలూరు, ఆగస్టు 4 : భారీ వృక్షం రహదారిపై కూలడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కైకలూరు నుంచి కోరుకొల్లు వెళ్లే రోడ్డులో గురువారం ఉదయం భారీ వృక్షం కూలింది. మధ్యాహ్నం వరకు చెట్టును తొలగించకపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. కైకలూరు పంట కాల్వ గట్టుపై చెట్టు కూలిందన్న సమాచారం తెలుసుకున్న జలవనరుల శాఖ ఏఈ రాజగోపాల్‌ యంత్రాల సాయంతో చెట్టును తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.

Updated Date - 2022-08-05T05:10:06+05:30 IST