ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-12-07T00:23:17+05:30 IST

హనుమద్వ్రత మహోత్సవాలు సందర్బంగా నందమూరు గరువు భక్తాంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
మొగల్తూరులో తమలపాకుల పూజ

వీరవాసరం, డిసెంబరు 6: హనుమద్వ్రత మహోత్సవాలు సందర్బంగా నందమూరు గరువు భక్తాంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో మం గళవారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. సీతారామ బాలభక్త భజన సమాజం సంకీర్తలనలు ఆలపించింది.

మొగల్తూరు: ఆంజనేయస్వామి ఆలయంలో లక్ష తమలపాకులతో పూజా కార్యక్ర మాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

పాలకొల్లు అర్బన్‌: హనుమాన్‌ జయంతి సందర్భంగా పట్టణంలోని రైలు గేటు వద్ద ఆంజనేయస్వామి గుడి, పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కెనాల్‌ రోడ్డులోని దాసోహాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు ఎం శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో గంధ సింధూర, తమలపాకుల పూజలు చేశారు. భక్తులు హనుమాన్‌ చాలీసా పఠించారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: ఆరుగొలను అభయాంజనేయస్వామి ఆలయంలో నూకల ధనకృష్ణ, బుల్లియ్య ఆధ్వర్యంలో మంగళవారం హనుమద్వ్రతం నిర్వహించారు. లక్ష తమల పాకుల పూజ, అభిషేకాలు, మండపారాధన, హోమాలు నిర్వహించారు.

Updated Date - 2022-12-07T00:23:21+05:30 IST