పవర్‌ పేటలో బంగారం చోరీ

ABN , First Publish Date - 2022-11-24T23:51:23+05:30 IST

ఏలూరులోని పవర్‌పేట మొండూరివారి వీధిలో గురువారం తెల్లవారు జామున దొంగలు ఒక ఇంట్లో 6 కాసుల బంగారం అపహరించుకుపోయారు.

పవర్‌ పేటలో  బంగారం చోరీ
వేలిముద్రలుపరిశీలిస్తున్న క్లూస్‌ టీమ్‌

ఏలూరు రూరల్‌, నవంబరు 24 : ఏలూరులోని పవర్‌పేట మొండూరివారి వీధిలో గురువారం తెల్లవారు జామున దొంగలు ఒక ఇంట్లో 6 కాసుల బంగారం అపహరించుకుపోయారు. బాఽధితుడు సింగ వరపు హరి ప్రకాష్‌ తెలిపిన వివరాలు ప్రకారం ఆ వీధిలో మూడంతస్తుల భవనంలో కింద పోర్షన్‌ అద్దెకు ఇవ్వగా రెండు, మూడు అంతస్తుల్లో హరి ప్రకాష్‌ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. గురువారం రాత్రి రెండో పోర్షన్‌ ఇంటి తలుపులకు తాళాలు వేసి పైగదిలో నిద్రిస్తున్నారు. ఇదే సమయంలో తెల్లవారు జామున తలుపులు బద్దలు కొడుతున్న శబ్దం రావడంతో బయ టకు వచ్చేందుకు ప్రయ త్నించారు. అయితే దొంగలు ఇంట్లో వారు బయ టకు రాకుండా తలుపులు గడియ పెట్టేశారు. వెంటనే తేరుకుని కింద పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న వారికి ఫోన్‌ చేసి విషయం తెలుపగా వారు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. వారి ఇళ్ల తలుపులకు కూడా గడియ పెట్టేశారు. తెల్ల వారు జామున మూడు గంటల ప్రాంతంలో తలుపులు బద్దలు కొట్టి దొంగలు చొరబడి బీరువాలో ఉన్న ఆరు కాసుల బంగారు నల్లపూసల గొలుసు, హరి ప్రకాష్‌ ప్యాంటు జేబులో ఉన్న పర్సులో 15,000 తస్కరించారు. వెంటనే 100కు ఫోన్‌ చేయగా పోలీసులు, క్లూస్‌ టీమ్‌ అక్క డకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్‌ ఏఎస్‌ఐ అచ్యుతరావు తెలిపారు

Updated Date - 2022-11-24T23:51:23+05:30 IST

Read more