‘జీవో 429 పునరుద్ధరించాలి’
ABN , First Publish Date - 2022-04-30T05:54:29+05:30 IST
‘జీవో 429 పునరుద్ధరించాలి’
తాడేపల్లిగూడెం రూరల్, ఏప్రిల్ 29: ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు ఇచ్చేలా జీవో నెంబర్ 429ను పునరుద్ధరించాలని పీఎంపీలు(ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లు) డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు విన్నవించుకున్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన పీఎంపీల రాష్ట్ర సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ముఖ్యమంత్రికి నివేదించి, సమస్యను పరిష్కరిస్తానని వారికి డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. అనారోగ్యంతో ఇబ్బందిపడే పేదలను ఆరోగ్య శ్రీ ఆసుపత్రులకు చేర్పించేందుకు సహాయపడాలని, కమీషన్ల కోసం దోపిడీ చేయ డంమానుకోవాలని పీఎంపీలకు ఆయన హితవు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు నిడ మర్తి జయసూర్య, యాక్షన్ కమిటీ చైర్మన్ వీబీటీ రాజు, జిల్లా అధ్యక్షుడు ఆర్‌కే పర మేశ్వరరావు, కార్యదర్శి ఎం.జయరాం పాల్గొన్నారు.