ఐక్యతకు ప్రతీక వన సమారాధనలు

ABN , First Publish Date - 2022-10-30T23:15:44+05:30 IST

ఆత్మీయత, ఐక్యతకు ప్రతీక వన సమారాధన అని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.

ఐక్యతకు ప్రతీక వన సమారాధనలు
ఆకివీడులో ఉసిరి చెట్టు వద్ద పూజలు చేస్తున్న ఎమ్మెల్యే రామరాజు

ఆకివీడు, అక్టోబరు 30: ఆత్మీయత, ఐక్యతకు ప్రతీక వన సమారాధన అని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. రైస్‌ మిల్లర్‌ యిమ్మిడిశెట్టి చిన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్తీక వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. బొల్లా వెంకట్రావు, మాజీ సర్పంచ్‌ గొంట్లా గణపతి,ఫ్లోర్‌ లీడర్‌ బొల్లా వీరశ్వేత, కౌన్సిలర్‌ బత్తుల శ్యామల, మీసాల రవికుమార్‌, నౌకట్ల రామరావు, బొల్లా శేషుబాబు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన జరిగింది. శ్రీనగర్‌ కాలనీలో కనకదుర్గ యువజన సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రోత్సవ అన్నసమారాధన జరిగింది. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ జామి హైమావతి, పెంకి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణ సంఘం, పద్మశాలీ సంఘాల వన సమారాధన

పాలకొల్లు అర్బన్‌: శివ కేశవులకు సమ ప్రాధాన్యం ఇచ్చే మాసం కార్తీక మాసం అని ప్రముఖ పండితులు గొర్తి సుబ్రహ్మణశాస్త్రి అన్నారు. ఛాంబర్స్‌ కళాశాలల ఆవరణలో ఆదివారం క్షీరా రామ బ్రాహ్మణ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. కార్తీక దామోదర పూజ, గణపతి హోమం, వాస్తు హోమం, రుద్ర హోమం నిర్వహించారు. సంఘ పూర్వాధ్యక్షుడు సోమంచి శ్రీనివాస శాస్త్రి, అనూరాధ దంపతులను సత్కరించారు. బుద్దవరపు వెంకట సత్య సుబ్బారావు, తోలేటి శ్రీనివాసరావు, సభ్యులు సూర్యనారాయణ, ఎ.మురళి, కె.శ్రీనివాస్‌, చల్లా సాయి, సీహెచ్‌. నరసింహమూర్తి, నందుల దశరఽథ్‌, సుమారు 1200 మంది పాల్గొన్నారు.

పూలపల్లి బైపాస్‌రోడ్డులోని అడబాల గార్డెన్స్‌ ఆవరణలో ఆదివారం పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధనలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యడ్ల తాతాజీ, అడబాల వెంకట రమణ, వంగర సరేష్‌కుమార్‌, సత్యనారాయణ, నీలంశెట్టి సత్యప్రసాద్‌, సుధా కాంతారావు, జాగు సత్యనారాయణ, శీరం ఆనంద కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-30T23:15:53+05:30 IST