ధాన్యం కొనలేని ప్రభుత్వం గద్దె దిగాలి : గన్ని

ABN , First Publish Date - 2022-12-05T00:30:22+05:30 IST

ఆరుగాలం కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు విమర్శించారు.

ధాన్యం కొనలేని ప్రభుత్వం గద్దె దిగాలి : గన్ని
గుండుగొలనులో ధాన్యాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే గన్ని

భీమడోలు, డిసెంబరు 4 :ఆరుగాలం కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు విమర్శించారు. ఆదివారం గుండుగొలను రోడ్డుపై ధాన్యం ఆరబోస్తున్న రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు చెప్పిన సమస్యలను తెలుసుకుని మాట్లాడారు. తేమ చూసే పరికరాలు రైస్‌ మిల్లర్ల వద్ద ఉన్నవి సరైనవా కాదా అని ప్రశ్నించారు. ఆర్బీకేల్లో తీస్తున్న తేమ శాతానికి, మిల్లర్ల వద్ద తీస్తున్న తేమ శాతానికి వ్యత్యాసం వస్తుందని దీంతో రైతు మిల్లర్లకు అదనంగా సొమ్ము చెల్లించాల్సి వస్తోందన్నారు. రైతుల సొమ్మును నాయకులు, మిల్లర్లు దోచుకుంటున్నారని విమర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు కొండబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-05T00:30:23+05:30 IST