వైభవంగా గణేశ నిమజ్జన ఊరేగింపులు

ABN , First Publish Date - 2022-09-10T05:34:54+05:30 IST

జగన్నాథపురం నడిగడ్డ రామాలయం వద్ద ఏర్పాటుచేసిన మండపంలో గణనాథుడిని శుక్రవారం ఆసాదుల గరగ నృత్యాలు, బ్యాండు మేళం, విచిత్ర వేషధారణలతో వైభవంగా ఊరేగించారు.

వైభవంగా గణేశ నిమజ్జన ఊరేగింపులు
తాడేపల్లిగూడెంలో గణేశ నిమజ్జనం ఊరేగింపు

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 9: జగన్నాథపురం నడిగడ్డ రామాలయం వద్ద ఏర్పాటుచేసిన మండపంలో గణనాథుడిని శుక్రవారం ఆసాదుల గరగ నృత్యాలు, బ్యాండు మేళం, విచిత్ర వేషధారణలతో వైభవంగా ఊరేగించారు. రథానికి సింహాల బొమ్మలు ఆకర్షణగా నిలవడంతో ఊరేగింపు చూసేందుకు చట్టుపక్కల గ్రామాల వారు  కూడా తరలివచ్చారు.మొగల్తూరు: వినాయక చవితి వేడుకలు ముగింపు సందర్భంగా స్వా మివారి నిమజ్జన ఊరేగింపులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిర్వహిం చారు. మొగల్తూరు దయాల్‌దాస్‌పేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లోని వినాయకుడిని కేరళ డప్పువాయిద్యాలు, తీన్‌ మార్‌ డప్పులు, శక్తివేషధారణలతో, బాణసంచా కాలుస్తూ యువకుల నృత్యాలతో స్వామివారిని ఘనంగా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు.

Read more