భారీ వర్షం

ABN , First Publish Date - 2022-08-05T05:08:02+05:30 IST

మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటల తరబడి కురిసిన వర్షానికి అంతర్గత, ప్రధాన రహదారులు సైతం జలమయంగా మారాయి.

భారీ వర్షం
ముసునూరు ప్రధాన రహదారిపై నిలిచిన వర్షపునీటి దృశ్యాలు

ముసునూరులో రహదారులు జలమయం
డ్రెయినేజీ అస్తవ్యస్తంతో పొంగిపొర్లిన వర్షపునీరు

ముసునూరు, ఆగస్టు 4 : మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటల తరబడి కురిసిన వర్షానికి అంతర్గత, ప్రధాన రహదారులు సైతం జలమయంగా మారాయి. గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో రహదారులపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సూరేపల్లి దిబ్బగూడెం కాలనీలో డ్రెయినేజీ ఆక్రమణకు గురికావడంతో ఇళ్ల వద్ద నిలిచిన నీరు పోయే పరిస్థితి లేకపోవడంతో సుమారు ఐదు ఇళ్లు నీటమునిగాయి. ఈ వర్షానికి చెరువులో ఒక మోస్తారుగా నీరు చేరింది. వరి, అరటి, పామాయిల్‌ ఇతర ఉద్యానవన పంటలకు ఈ వర్షం ఉపయుక్తంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.



Updated Date - 2022-08-05T05:08:02+05:30 IST