పెనుముప్పు
ABN , First Publish Date - 2022-07-16T06:27:40+05:30 IST
నిన్నటి వరకు గోదావరి వరదల చరిత్రలో 1986 వరదలే ఒక రికార్డు. ఆ సంవత్సరం భద్రాచలం వద్ద 75.6 అడుగుల నీటి మట్టం నమోదైంది.
గోదావరి మహోగ్రరూపం
భద్రాచలం వద్ద 71 అడుగులకు దాటి ప్రవాహం.. ఎగువ నుంచి దూసుకొస్తూ
జల దిగ్బంధంలో వేలేరుపాడు, కుక్కునూరు.. వేలాది మంది నిరాశ్రయులు
సురక్షిత ప్రాంతాలకు తరలింపు
బాధితుల అత్యవసర సహాయానికి కాటంనేని భాస్కర్ నియామకం
గర్భిణులకు సాయపడ్డ వాయుసేన..
మరో 24 గంటలు గడవాల్సిందే
వరద భయంతో అందరిలోనూ టెన్షన్
నిన్నటి వరకు గోదావరి వరదల చరిత్రలో 1986 వరదలే ఒక రికార్డు. ఆ సంవత్సరం భద్రాచలం వద్ద 75.6 అడుగుల నీటి మట్టం నమోదైంది. మళ్లీ అదేస్థాయిలో ఇప్పుడు గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం రాత్రి పది గంటలకు 71 అడుగుల నీటి మట్టం చేరింది. ఎగువన ఉన్న వరదను దృష్టిలో పెట్టుకుని ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఇప్పటి వరకు రికార్డుగా ఉన్న 75.6 అడుగుల నీటి మట్టం దాటిపోయే అవకాశం కనిపిస్తోంది.
గోదావరిలో వరద.. 36 ఏళ్లనాటి రికార్డును తిరగరాస్తోంది. భద్రాచలం నుంచి దిగువన పోలవరం వైపు దూసుకొస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వారం రోజులుగా అంతకంతకు పెరుగుతూ వచ్చిన వరద ఇప్పుడు గరిష్ట స్థాయికి, అత్యంత ప్రమాద స్థాయికి చేరింది. ఇప్పటికే ముంపు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు దాదాపు జల సమాధి అయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వాయుసేన హెలికాప్టర్ల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. గర్భిణులను వాటి ద్వారానే ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
(ఏలూరు/కుక్కునూరు/వేలేరుపాడు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
గోదావరి కనీవినీ ఎరుగని రీతిలో పెను వరద రూపంలో విరుచుకుపడుతోంది. అంచనాలకు మించి ఎగువ ప్రాంతాల నుంచి పోలవరం వైపు దూసుకొస్తోంది. 48 గంటలు గడిస్తే తప్ప చెప్పలేని పరిస్థితి. భద్రాచలం వద్ద ఇప్పటికే అనూహ్యంగా గత రికార్డులను అధిగమిస్తూ నీటి మట్టం నమోదవుతోంది. ఇది మరింత పెరిగి 1986లో నమోదైన 76 అడుగులకు మించి ప్రమాదటపు అంచునకు చేరుకునే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గోదావరికి ఇరువైపులా గట్లు బలహీనంగా వున్న చోట్ల ఆరు ప్రాంతాలను గుర్తించారు. అక్కడ ఇసుక బస్తాలతో పటిష్ట ఏర్పాట్లకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఇసుక ర్యాంపులు పెట్టి ఎడాపెడా వాహనాలు తిరగడంతో అక్కడక్కడ గట్టు ఎత్తు తగ్గిపోయి వరద చొచ్చుకొచ్చే ప్రమాదాన్ని అధికారులు గుర్తించారు. ఎగువ నుంచి 30 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు పోలవరం వైపు దూసుకొస్తే జరగబోయే పరిణామాలపై ఇప్పటికే అధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలకు నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేకు అత్యంత సమీపాన వున్న పోలవరం గ్రామానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. గ్రామం చుట్టూ ఉన్న నక్లెస్ బండ బలహీనపడడం, నక్లెస్ బండ విస్తరించిన చోట అండలు విరుచుకు పడుతుండడంతో ఈ అనుమానం మరింత బలపడింది. కడెమ్మ స్లూయిజ్ వద్ద గోదావరి ఊహించని రీతిలో పెరగడం, దీంతో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సిద్ధంగా ఉండాల్సిందిగా ఆదేశం. ఇంకోవైపు ఎగువున ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల అనూహ్యంగా ఉండబోతుందన్న సమాచారం అధికారులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తక్షణ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని, నిర్ణయాలు వేగవంతంగా తీసుకోవాలని భావిస్తున్నారు. పోలవరం దిగువున ఉన్న అన్ని ప్రాంతాల్లోను పటిష్టతకు మరింత భద్రత. ముంపు మండలాల్లో అత్యంత భయానక పరిస్థితి. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు మూడొంతులు మేర దాదాపు జల సమాధి అయినట్టే. ఇంతకుముందు 1986లో ఊహించని వరద ముంచెత్తినప్పుడు ఆయా మండలాల్లో అనేకమంది ఆచూకీ ఇప్పటికీ కనపడలేదు. ఇంకొందరు వరదలో అదృశ్యమైనట్టు చెబుతారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రాత్రి పది గంటలకు 71 అడుగులకు మించి చేరడమే కాకుండా ఇది మరింత గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉన్నట్టు వేస్తున్న అంచనాలతో జనం విలవిలలాడిపోతున్నారు.
ముంపుతో అష్ట దిగ్బంధనం
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వేలాది మందిని ఎగువ ప్రాంతాలకు తరలించారు. అష్ట దిగ్బంధనంలో వున్న ఈ రెండు మం డలాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రయత్నిస్తున్నారు. కుక్కునూరులో 34, వేలేరుపాడులో 40 గ్రామాలు పూర్తిగా నీట ముని గాయి. పరిస్థితి ఊహించని స్థితికి చేరుకుంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోవడంతోపాటు శుక్రవారం కమ్యూనికేషన్ నెట్‌వర్క్ టవర్లు నీట మునగడంతో సమాచార విస్తరణకు పూర్తిగా అడ్డంకి ఎదురైంది. దీని నుంచి తక్షణం బయటపడేందుకు వీలుగా యంత్రాం గం కదిలింది. ఎక్కడైతే సెల్ టవర్లు నీటిలో నిండి పనిచేయకుండా ఉంటాయో అక్కడ తక్షణం జనరేటర్లను అందుబాటులోకి తేవాలని, నెట్‌వర్క్ కొనసాగేలా చూడాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం రాత్రే ఆ దిశగా చర్యలకు దిగుతున్నారు. ఇంకో వైపు సబ్ స్టేషన్‌లోనూ నీరు చేరడం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు నివాసాలు పూర్తిగా నీట మునగడం మరింత భయం నింపింది. పోలీస్, రెవెన్యూ, సంక్షేమ భవనాలన్నీ పూర్తిగా నీటిలో కలిసిపోయాయి. ఇప్పటికే ఆయా కార్యాలయాల్లో ఉన్న రికార్డులను సురక్షిత ప్రాంతాలకు తరలించి తాము కూడా ఆ దిశగానే కదిలారు.
నిత్యావసర వస్తువుల కొరత
ఐదు రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కొనసాగు తుండడంతో అంతకంతకు పెరిగి జనజీవనం అస్తవ్య స్తం కావడంతో ముంపు మండలాల్లో పరిస్థితి మరింత క్షీణింపచేసేలా ఉన్నాయి. ఈ రెండు మండలాల్లోనూ అప్పుడే నిత్యావసర వస్తువుల కొరత ఆరంభమైంది. దుకాణాలు నీట మునగడం, బయట ప్రాంతాల నుంచి సరుకులు తెచ్చుకునే పరిస్థితి లేనంతగా వరద పది అడుగుల మేర చేరింది. దీంతో నిత్యావసర వస్తువులు లేక విలవిలలాడుతున్నారు. ఆయా కుటుంబాలకు సరి పడా ఆహార పదార్ధాలను అందజేసేందుకు అధికారులు ఇప్పటికే ముప్పు తిప్పలు పడుతున్నారు. ప్రతీ కుటుం బానికి ఐదు కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు అందిస్తున్నా ఇది ఏ మాత్రం సరిపోవడం లేదు. సహా య శిబిరాల్లో ఉన్న వారు సైతం తమ వారు ఎలా ఉన్నారో కనుగొనేందుకు ప్రయత్నిస్తుండగా, సెల్‌ఫోన్ల మొరాయింపుతో ఉసూరుమంటున్నారు. ఓ వైపు ప్రాణనష్టం జరగకపోయినా మరోవైపు మూగ జీవాల రోదన కలిచివేస్తోంది. ఈ రెండు మండలాల్లో పాడి పశువులు గోదావరి వరదలో కొట్టుకుపోయాయి. మరోవైపు భారీగా వస్తున్న వరద నేపథ్యంలో తక్షణ సహాయం అందించేందుకు జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి కాటంనేని భాస్కర్‌ను ప్రభుత్వం రంగంలోకి దించింది. ఆయన శుక్రవారం రాత్రికే ఏలూరు చేరుకున్నారు. తాజా పరిస్థితిని నివేదిక రూపంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆయనకు అందించారు.
భారీగా నష్టం
ముంపు మండలాల వాసులు నిర్వాసిత కాలనీలకు తరలించాల్సి ఉన్నా ఆ ప్రక్రియ దాదాపు మందగించింది. తాజా వరదల కారణంగా ఇంట్లో వున్న వస్తువులను, సొంత ఇంటిని అనేక మంది కోల్పోయారు. లక్షల్లో నష్టం చవిచూశారు. అప్పటికప్పుడు అందుబాటు లో వున్న వస్తువులను మాత్రమే వెంట తీసుకుని ఎత్తయిన ప్రాంతాలకు తరలిపోయారు. పొలాలు నీట మునగడంతో పంట నష్టం, పాడి పశువుల ను కోల్పోవడంతో మరింత నష్టం పిడుగులా వీరి మీదే పడింది. దానికంటే మించి వరద మరింతగా విజృంభించి దూసుకొస్తే ఈ సారి నష్టం ఊహించనలవి కానట్టు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసువచ్చారు. జడ్పీ సీఈవో రవికుమార్ సహాయ శిబిరాల వద్ద పర్యవేక్షిస్తున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కొండలపై ఉన్న బాధితులకు నిత్యావసర వస్తువులను ట్రాక్టర్‌పై చేరవేస్తున్నారు.
ఈ రెండు రోజులు కీలకం
గోదావరిలో వరద మరింత వేగంగా, ఉధృతంగా, ప్రమాదస్థాయిలో పోలవరం వైపు దూసుకొస్తే నష్టం ఏ రీతిలో ఉండబోతుందోననే దానిపై తర్జనభర్జన లు జరుగుతున్నాయి. ముంపు మండలాలు ఇప్ప టికే పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయాయి. గ్రామా లకు గ్రామాలే జల సమాధి అయ్యే పరిస్థితి నెలకొంది. ప్రజ లు సహాయ శిబిరాలకు, ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 1986 నాటి వరద పరిస్థితు లను ఇప్పుడు నెమరేసుకుంటున్నారు. అప్పుడు జరిగిన బీభత్సాన్ని తలచుకుని భయంతో వణికిపోతున్నారు. మరోవైపు పోలవరం ఎగువ, దిగువున కూడా భయానక పరిస్థితి నెల కొంది. పోలవరం ఎగువున బ్యాక్ వాటర్ మరింత భయాన కంగా ఉండబోతుందని, దీనికితోడు శబరి పోటెత్తడం, తెలం గాణలోని ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదల ఇవన్నీ కలిసొచ్చి ఎవరి ప్రాణాల మీదకు తెస్తుందోనని గజగజ వణికిపోతున్నారు. 1986లో అప్పటి గోదావరి వీర విజృం భణ చేసినప్పుడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ధవళే శ్వరం వద్ద అనేక రక్షణ చర్యలు తీసుకుంది. స్థానిక రైతులు ధైర్యం చేసి ధవళేశ్వరం సమీపాన బొబ్బర్లంక వద్ద గట్టు కు ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా భారీ వరదలోను ప్రాణాలకు తెగించి పనిచే శారు. ఒకవైపు భారీ వర్షం కురుస్తున్నా ఏ మాత్రం ఖాతరు చేయకుండా గండి పడే ప్రాంతాల్లో ధైర్యంగా నిలబడిమట్టి, ఇసుక బస్తాలను జారవిడుస్తున్న నేప థ్యాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. సాధ్యమైనంత మేర అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలని ఎవరికి వారు తమ ఇష్ట దైవాన్ని వేడుకుంటున్నారు.
ముంపు ముప్పులో పోలవరం
పోలవరం గ్రామానికి రక్షణగా వేసిన నెక్లస్ బండ్ సీడబ్ల్యూసీ కార్యాలయం వద్ద కోతకు గురవుతుండడంతో అధికారులు రక్షణ కోసం వేసిన ఇసుక బస్తాలు, వెదురు తడికలు, సర్వే బాదులు ఎగువ నుంచి వస్తున్న వరద జలాల తాకిడికి తట్టు కునే పరిస్థితిలో లేవని నెక్లస్ బండ్‌కు గండి పడే అవకాశాలు ఉన్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నా రు. అధికారులు స్పందించి ప్రస్తుత పరిస్థితులపై స్పష్టత ఇవ్వాలి.

