రైతుల పడిగాపులు

ABN , First Publish Date - 2022-12-07T00:29:17+05:30 IST

పండిన పంటను మిల్లులకు తరలిం చేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.

రైతుల పడిగాపులు
వేబ్రిడ్జి వద్ద ధాన్యంతో నిలిచిపోయిన ట్రాక్టర్లు

ఆకివీడురూరల్‌ డిసెంబరు 6 : పండిన పంటను మిల్లులకు తరలిం చేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలుకు గొప్పగా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబు తున్నా.. క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. తేమ శాతం కోసం 15 రోజులపాటు ధాన్యాన్ని ఆరబెట్టి ఆర్‌బీకెలకు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యాన్ని వాహనాలకు ఎగుమతి చేస్తే సరిపోతుందన్నారు. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో వేబ్రిడ్జి నుంచి రైస్‌ మిల్లుల వద్ద దిగుమతి వరకు రైతులే ఉండాల్సి వస్తోంది. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

ఏరీ కస్టోడియన్‌ ఆఫీసర్స్‌

ధాన్యాన్ని వేబ్రిడ్జి నుంచి రైస్‌ మిల్లుల వద్దకు పంపిన తరువాత అక్కడి నుంచి కస్టోడియన్‌ ఆఫీసర్స్‌ అయిన వీఆర్‌వోలు బాధ్యత తీసుకోవాలి. కాని, వారు పట్టించుకోకపోవడంతో రైతులే రైస్‌ మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విధానానికి అధికారులే తూట్లు పొడుస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండల టీమ్‌లేవీ..?

ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఏర్పాటు చేసిన మండల టీమ్‌ పర్యవేక్షణ లేకపోవడం తో రైతుల సమస్యలు తీరడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారానికి ఉన్నతా ధికారులు దృష్టికి తీసుకెళ్ళాల్సిన అధికా రులు నిర్లక్ష్యంగా తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

మిల్లుల వద్ద పడిగాపులు

రైతులకు రైస్‌ మిల్లులతో సంబం ధం లేకుండా ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు తీసుకువచ్చామని ప్రభు త్వం చెబుతోంది. కానీ రైతులు మాత్రం అలా జరగడం లేదని, తామే మిల్లులకు తీసుకుని వెళ్లి పడిగాపులు కాసి దిగుమతి చేసుకోవాలని బతిమ లాడుకోవాల్సి వస్తోందని వాపోతున్నా రు. దిగుమతికి హమాలీల ఖర్చు తమ వద్ద వసూలు చేస్తున్నారంటున్నారు. దీనికితోడు వేబ్రిడ్జిలు ఉన్న ప్రాంతంలో విద్యుత్‌ కోతలు అధికంగా ఉండటంతో ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. కంచే చేను మేసిన చందాన ప్రభుత్వం తీసు కు వచ్చిన నూతన విధానానికి అధికా రులే తూట్లు పొడుస్తున్నారు. తుఫాను హెచ్చరికల నేపఽథ్యంలో రైతులు మరిం త ఆందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే శీతగాలి ఎక్కువగా ఉండి, విపరీతంగా మంచు కురుస్తుండటం తో సూర్యకాంతి తక్కువగా భూమికి చేరుతుండటంతో ధాన్యం ఆరక తీవ్రంగా నష్టపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-07T00:29:22+05:30 IST