ఉచిత నేత్ర వైద్య పరీక్షలు
ABN , First Publish Date - 2022-09-19T04:57:21+05:30 IST
జీలకర్రగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు వంద మందికి ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు.
కామవరపుకోట, సెప్టెంబరు 18 : జీలకర్రగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు వంద మందికి ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం జీలకర్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీమతి రాజరాజేశ్వరి కంటి ఆసుపత్రి నిడదవోలు వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ నాగరాజు రోగులను పరీక్షించి 16 మందికి ఆపరేషన్ అవసరమని గుర్తించి, ఉచితంగా కంటి ఆపరేషన్లు నిడదవోలులో చేస్తామన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎల్‌ఎన్ మందలపు రామకృష్ణ ఆర్థిక సాయంతో రోగులకు మందులు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు ఆర్‌ఆర్ రత్నకుమారి, సెక్రటరీ ఎస్‌ఆర్‌ఆర్ రమేష్‌వర్మ, ట్రెజరర్ బి.సత్యనారాయణరాజు, అడ్మినిస్ట్రేటర్ ఆర్‌ఆర్ రంగరాజు సభ్యులు, ఎస్‌ఆర్‌ఆర్ వీర రామకృష్ణంరాజు, ఐవీఎస్ రాజు, ఘంటా మధుబాబు, బాలవర్ధిరాజు, ఎస్‌వీపీకెహెచ్ మురళీవర్మ, శర్మ, బి.రవికుమార్‌రాజు, ఎం.శ్రీనివాసరావు, పూర్ణశ్రీ తదితరులు ఉన్నారు.