ఘనంగా మాగంటి బాబు జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-02-06T06:12:58+05:30 IST

మాజీ ఎంపీ మాగంటి బాబు జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తం గా శనివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మాగంటి బాబు జన్మదిన వేడుకలు
కామవరపుకోటలో కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు

 కామవరపుకోట/చింతలపూడి/కొయ్యలగూడెం/టి.నరసాపురం/పోలవరం,  ఫిబ్రవరి 5 : మాజీ ఎంపీ మాగంటి బాబు జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తం గా శనివారం ఘనంగా నిర్వహించారు. కామవరపు కోట మండలం పాతూరులో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ నివాస గృహంలో పార్టీ సీనియర్‌ నాయకుడు కంఠమనేని సత్యనారాయణ కేక్‌ కట్‌ చేశారు. టీడీపీ మండల నాయకుడు కిలారు సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ ఘంటా సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి మండల టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఎన్జీఆర్‌ విగ్రహం వద్ద నాయకుడు జె.ముత్తారెడ్డి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొయ్యలగూడెం మండలంలో కొయ్యలగూడెంలో తెలుగు యువత నాయకుడు పడమటి రవి, రాఘవ, శ్రీను తదితరులు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. బయ్యన్నగూడెంలో తెలుగు యువత నాయకుడు పారేపల్లి నరేష్‌ ఆధ్వర్యం లో వేడుకలు నిర్వహించారు. టి.నరసాపురం మండలంలో టి.నరసాపురం, మక్కినవారిగూడెం, రాజుపోతే పల్లి గ్రామాల్లో కేక్‌లు కట్‌ చేశారు. రాష్ట్ర కార్యదర్శి జయవరపు శ్రీరామూర్తి, మండల ప్రధాన కార్యదర్శి ఆచంట అనీల్‌కుమార్‌, ఏలూరు పార్లమెంట్‌ రైతు కార్యదర్శి దాసరి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. పోలవరం మండలం బంగారమ్మపేట కనకదుర్గ ఆలయంలో ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ కుంచే దొరబాబు ఆధ్వ ర్యంలో పూజలు నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ, ఎస్టీ సెల్‌ నాయకులు సున్నం సుధీర్‌ రాజు, ఎస్సీ సెల్‌ మండల నాయకులు యడ్ల వినోద్‌, మాజీ జడ్పీటీసీ కుంజం సుభాషిణి, మాజీ ఉపసర్పంచ్‌ మం గిన కొండ, జల్లేపల్లి వెంకట నరసింహారావు, రాజా, జితేంద్ర, పిల్లి నాగరాజు, పాదం ప్రసాద్‌, త్రిపుర సుందరి, రెడ్డి మురళి, బేరా పైడిరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-06T06:12:58+05:30 IST