జూట్‌ మిల్లును తెరిపించాలి

ABN , First Publish Date - 2022-05-19T05:28:38+05:30 IST

చట్టవిరుద్దంగా మూసివేసిన ఏలూరు కృష్ణా జూట్‌ మిల్లున తెరపించి కార్మికుల ఉపాధి కాపాడాలని, మూసిన కాలానికి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద ఐదు యూనియన్ల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు.

జూట్‌ మిల్లును తెరిపించాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న వివిధ కార్మిక సంఘాల నాయకులు

ఏలూరు కలెక్టరేట్‌, మే 18 : చట్టవిరుద్దంగా మూసివేసిన ఏలూరు కృష్ణా జూట్‌ మిల్లున తెరపించి కార్మికుల ఉపాధి కాపాడాలని, మూసిన కాలానికి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద ఐదు యూనియన్ల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మిల్లు తెరపిం చాలని నినాదాలు చేశారు. ఇప్టూ నాయకుడు యువి, టీఎన్‌టీయూసీ నాయకుడు ఉమాశంకర్‌, సీఐటీయూసీ నాయకులు జగన్నాధరావు, ఐఎన్‌టీయుసీ నాయకుడు పులి శ్రీరాములు, ఏఎన్‌టీయూసీ నాయకుడు బండి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. మిల్లు మూసి 112 రోజులు అయినప్పటికీ మిల్లు తెరిపించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. 24న ఎమ్మెల్యే ఆళ్ళనాని కార్యా లయానికి ర్యాలీగా వెళ్ళాలని నిర్ణయించారు. నాయకులు అప్పారావు, బద్దా వెంకట్రావు, నూకరాజు, రమణ, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T05:28:38+05:30 IST