పారిశుధ్య నగరంగా తీర్చిదిద్దుతాం : కమిషనర్‌

ABN , First Publish Date - 2022-07-06T05:48:21+05:30 IST

ఏలూ రు నగరాన్ని పారిశుధ్య నగరంగా తీర్చిదిద్దేందుకు పారిశుధ్య కార్మికులు కృషి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ షేక్‌ షాహీద్‌బాబు అన్నారు.

పారిశుధ్య నగరంగా తీర్చిదిద్దుతాం : కమిషనర్‌
నగరంలో పర్యటిస్తున్న కమిషనర్‌

ఏలూరు టూటౌన్‌, జూలై 5: ఏలూ రు నగరాన్ని పారిశుధ్య నగరంగా తీర్చిదిద్దేందుకు పారిశుధ్య కార్మికులు కృషి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ షేక్‌ షాహీద్‌బాబు అన్నారు. మంగళవారం నగరంలోని 9వ డివిజన్‌లో కూరగాయల మార్కెట్‌, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. శానిటేషన్‌కు సంబంధించి హెల్త్‌ అఽధికారులకు తగు సూచనలు ఇచ్చారు. స్వర్ణకారుల సంఘ నాయకులతో సమావేశమై శానిటేషన్‌పై అవగాహన కల్పించారు. క్లీన్‌ ఏపీలో భాగంగా యూజర్‌ఛార్జీలు చెల్లించాల్సిన అవశ్యకతను వివరించారు. వాటర్‌ట్యాంకు వద్ద వర్షపునీరు నిల్వలేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంహెచ్‌వో మాలతి, డీఈ కొండలరావు, ఏఈ రామారావు పాల్గొన్నారు. 

నగరంలోని 53, 54, 55వ డివిజన్లలోని వార్డు సచివాలయాలను సోమవారం ఆయన తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు చేశారు. మీ సేవా కేంద్రాల్లో చేసిన పనులన్నీ 540 సేవలను సచివాలయాల్లో చేయాలన్నారు. సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.  

Updated Date - 2022-07-06T05:48:21+05:30 IST