ఆక్వా చెర్వుల వైరింగ్‌పై దృష్టి పెట్టండి
ABN , First Publish Date - 2022-08-18T06:52:49+05:30 IST
ఆక్వా చెరువులపై విద్యుత్ వైరింగ్ విషయంలో ప్రమాద రహిత విధానాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని ఏపీసీపీడీసీ ఎల్ ఎస్ఈ ఎం.శివప్రసాద్ రెడ్డి ఆదేశించారు.

ముదినేపల్లి, ఆగస్టు 17 : ఆక్వా చెరువులపై విద్యుత్ వైరింగ్ విషయంలో ప్రమాద రహిత విధానాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని ఏపీసీపీడీసీ ఎల్ ఎస్ఈ ఎం.శివప్రసాద్ రెడ్డి ఆదేశించారు. ముదినేపల్లిలోని సబ్ స్టేషన్‌ను ఆయన ఈఈ (ఆపరేషన్స్ గుడివాడ) టి.రామకృష్ణతో కలసి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఈ పేర్ని రవికుమార్‌తోపాటు మండలంలోని విద్యుత్ శాఖ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ చేపలు, రొయ్యల చెరువులపై వైరింగ్ విషయంలో రైతులు అనుసరిస్తున్న విధానంతో విద్యుదాఘాతానికి గురై మరణాలు సంభవిస్తున్న ఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు మీటర్లు మంజూరు చేసే సమయంలోనే వైరింగ్ ఎలా చేయాలో మ్యాప్ ఇవ్వాలని ఎస్ఈ ఆదేశించారు. విధి నిర్వహణలో నిబంధనలు పాటిస్తామని సిబ్బందితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ముదినేపల్లి మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్వహణ పట్ల ఆయన సంతృఫ్తి వ్యక్తం చేశారు. అనంతరం సబ్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.