ప్రజలకు శాపంలా వైసీపీ పాలన
ABN , First Publish Date - 2022-12-16T00:25:32+05:30 IST
వైసీపీ ప్రభుత్వ పాలన ప్రజలకు శాపంలా మారిందని, అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల పట్ల ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ వాపోతున్నారని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు విమర్శించారు.
టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు
భీమడోలు, డిసెంబరు 15 : వైసీపీ ప్రభుత్వ పాలన ప్రజలకు శాపంలా మారిందని, అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల పట్ల ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ వాపోతున్నారని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు విమర్శించారు. కురేళ్ళగూడెంలో గురువారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యల ను తెలుసుకు రాసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నాయకులు గన్ని నాగగోపాలరావు, పార్టీ మండల అధ్యక్షుడు శిరిబత్తిన కొండబాబు, కరణం పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరుటూటౌన్ : కళ్ళుండి కబోదిలా జగన్ వ్యవరిస్తున్నాడని టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి రాధాకృష్ణయ్య విమర్శించారు. ఏలూరు 35వ డివిజన్లో ఇదేం ఖర్మ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూమళ్ళీ చంద్ర బాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి పదంలో పయనిస్తుంద న్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జ్ బాలాజీ, రాజు, తంగెటి మనోహర్, కే.సురేష్, దుర్గాప్రసాద్, వెంకటేశ్వరరావు, ఎ.రంగారావు, రమేష్, పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : వైఎస్ జగన్రెడ్డి అసమర్థ పాలనలో ప్రజలు అనేక విధాలుగా అవస్థలు పడుతున్నారని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ అన్నారు. బుట్టాయగూడెంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను అడిగి తెలుపుకున్నారు. టీడీపీ పోరాటాలకు ప్రజలు అండగా ఉండాలని 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మొగపర్తి సోంబాబు, నాయకులు మడకం రామకృష్ణ, కుందుల శ్రీను, గద్దె అబ్బులు తదితరులు పాల్గొన్నారు.
చింతలపూడి :చింతలపూడి నగర పంచాయతీలోని వెలమపేటలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి టీడీపీ శ్రేణులు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వెలమపేటలో పలు గృహాల వద్దకు వెళ్లి రోడ్డు సమస్యలు, డ్రెయినేజీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ శాఖ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు మాట్లాడారు. బోడా నాగభూషణం, కంభం రమేష్, దొడ్డిగర్ల ప్రభాకరరావు, తాటి అప్పారావు పాల్గొన్నారు.