క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి : డాక్టర్ విజయ్‌కృష్ణ
ABN , First Publish Date - 2022-08-04T05:53:18+05:30 IST
క్రమశిక్షణ పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డాక్టర్ బసవ విజయ్‌కృష్ణ (అమెరికా) అన్నారు.
భీమవరం ఎడ్యుకేషన్, ఆగస్టు 3 : క్రమశిక్షణ పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డాక్టర్ బసవ విజయ్‌కృష్ణ (అమెరికా) అన్నారు. బుధవారం బీవీ రాజు మున్సిపల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అరసవల్లి ఈశ్వరమ్మ వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 250 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్స్, జాతీయ జెండాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ఉంటే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, ప్రతీ ఒక్కరూ చదువుకుని అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలన్నారు. బీజేపీ యువమోర్చా నాయకుడు అల్లూరి సాయిదుర్గరాజు మాట్లాడుతూ దాతలందిస్తున్న సహకరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యా, వైద్య, ఆరోగ్య సేవా కార్యక్రమాలలో భాగంగా ట్రస్ట్ ద్వారా నిరంతర సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని, ఈనెల 13, 14, 15 తేదీలలో ప్రతీ ఇంటా జాతీయ జెండాను ఎగురవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాబాజీ, అరసవల్లి మణికంఠ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.