-
-
Home » Andhra Pradesh » West Godavari » district fight-NGTS-AndhraPradesh
-
జిల్లా కేంద్రానికి దీక్షగా...
ABN , First Publish Date - 2022-03-05T05:43:43+05:30 IST
జిల్లా కేంద్రం నరసాపురాన్ని ప్రకటించాలంటూ అఖిలపక్షం అధ్వర్యంలో ఆటోకి తాడు లాగుతూ శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు.

నరసాపురం, మార్చి 4; జిల్లా కేంద్రం నరసాపురాన్ని ప్రకటించాలంటూ అఖిలపక్షం అధ్వర్యంలో ఆటోకి తాడు లాగుతూ శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. ముందుగా జేఏసీ శిబిరం వద్ద తీన్‌మార్ వాయించారు. ఆ తరువాత ఖాళీ ఆటోకి తాడు కట్టి లాగుతూ శివాలయం వరకు వెళ్లారు. అక్కడ కొద్ది సేపు నినాదాలు చేశారు. తిరిగి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుని సభ నిర్వహించారు. 33వ రోజు దీక్షలో శుక్రవారం స్వయం కృషి, క్రాంతి ఆటో యూని యన్ నాయ కులు కూర్చున్నారు.దీక్షలో వీరవెంకటస్వామి,ఎలీషా, రాజేష్, రాంబాబు, నాగేశ్వ రరావు,లెనిన్‌కుమార్, అలీషా కూర్చున్నారు.కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ నెక్కం టి సుబ్బారావు,మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ నాయకులు పొత్తూరి రామరాజు, కోటిపల్లి సురేష్, పోలిశెట్టి సాంబ,బాబులు పాల్గొన్నారు.